కోవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు నమ్మొద్దు

Published: Wednesday February 17, 2021

వలిగొండ ప్రజాపాలన కోవిడ్ వ్యాక్సిన్ పై వచ్చే అపోహలను నమ్మొద్దని స్థానిక వైద్యాధికారి సుమన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారత ప్రభుత్వ గేయ నాటక విభాగం మరియు రాష్ట్ర ప్యామిలి వెల్ఫర్, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ గురించి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్,డాక్టర్ సుమలత, సంతోష్ కుమార్, పసల లూర్దు శౌరి, నటరాజ్, లింగస్వామి, ప్రేమ్ కుమార్, భాగ్యలక్ష్మి, ప్రియ తదితరులు పాల్గొన్నారు.