ప్రజల సమస్యల పరిష్కారం కోసమే భట్టి పాదయాత్ర

Published: Wednesday June 08, 2022
అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని మధిర జూన్ 7 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో ఈనెల9 నుండి ఎర్రుపాలెం మండలంలో జరగబోయే పాదయాత్రను విజయవంతం చేయాలిఅమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని*

 ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసేందుకు సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఈనెల 9వ తేదీ నుండి ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర ప్రారంభమవుతుందని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో మధిర నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్క 340 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగిందన్నారు. మధిర నియోజకవర్గంలో మిగిలిపోయిన గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని వైరా మండలంలోకి భట్టి పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆమె తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల సైతం ఆపార్టీ ఎనిమిదేళ్లలో నెరవేర్చ లేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, రైతులు పండించిన ధాన్యాన్ని  కొనుగోలు చేయడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆమె పేర్కొన్నారు. పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు భారీ స్థాయిలో పెరిగాయన్నారు. ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా కౌన్సిలర్ కోనా ధని కుమార్ బండారు నర్సింహారావు ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి దా రా బాలరాజు బుచ్చి రా వెంకటేశ్వర్ రెడ్డి గోపి విజయ్ ఐదు మండలాల అధ్యక్షులు అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు