తల్లాడ ఎస్సైగా సురేష్ బాధ్యతలు స్వీకరణ..

Published: Saturday January 29, 2022
తల్లాడ, జనవరి 28 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ సబ్ ఇన్స్ పెక్టర్ గా పి.సురేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై నరేష్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఖమ్మం సీపీ ఆదేశాల మేరకు వెయిటింగ్ లో ఉన్న సురేష్ కు తల్లాడలో పోస్టింగ్ ఇచ్చారు. వైరా, చింతకాని ఎస్సైగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. పేకాట, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు.