ఘనంగా పండిత్ దీన్ దయాల్ జయంతి ఉత్సవాలు

Published: Monday September 26, 2022
బోనకల్ ,సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ , ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పిలుపుమేరకు బోనకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల నందు పండిత్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు మాట్లాడుతూ టాపిక్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం,భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అన్నారు.ప్రతి మానవుడి శరీరం, మనస్సు , తెలివితేటలు , ఆత్మ యొక్క ఏకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని దీన దయాళ్ ఉపాధ్యాయ రూపొందించారు. వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ, స్వావలంబన కల ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారం అని భావించాడు. భారతదేశం ఒక స్వతంత్ర , స్వాలంబన దేశంగా ఉండాలని భావించేవారు . వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి పాశ్చాత్య భావనలపై భారత దేశం ఆధారపడ కూడదని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతర పాశ్చాత్యీకరణ నుండి బయటపడటానికి భారతదేశానికి ఇది అత్యవసరం అని దీన్‌దయాల్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరావు ,యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కారంగుల మురళీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు బంధం నాగేశ్వరరావు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు భూక్య సైదా, అఖిల్ ఈశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.