దశదిన కర్మ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

Published: Monday October 18, 2021
బాలాపూర్: అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం బాలాపూర్ లోని సామల పాపి రెడ్డి గార్డెన్ నందు జరిగిన, తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకుడు, వెంకటాపుర్ మాజీ సర్పంచ్ జెనిగ కొమురయ్య యాదవ్ దశదిన కర్మకు మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి హాజరై, ఉద్యమకారుడు జెనిగా కొమరయ్య చిత్రపటానికి  (ఫోటో) పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, వారికి తన తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బడంగ్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ కొమరయ్య భార్య భారతమ్మ ను  ఓదార్చాన తీగల కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ శాసన సభ సభ్యులు తీగల కృష్ణారెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, కార్పొరేషన్ కార్పొరేటర్లు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.