రవింద్ర భారతిలో ప్రదర్శించిన మండల కళాకారులు నటించిన నాటకం

Published: Monday September 20, 2021
జన్నారం, సెప్టెంబర్19, ప్రజాపాలన : జన్నారం మండం పానకల్ గ్రామానికి చెందిన తెలంగాణ నేషనల్ ఫోక్ ఆర్టిస్ట్ దుర్గం అన్నపూర్ణ నటించిన పృష్ఠ నారి నాటకాన్ని శుక్రవారం రవింద్ర భారతిలో ప్రదర్శన చేయడం పట్ల స్థానికు‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవింద్ర భారతిలో నిర్వహించిన తియేటర్ ప్లే లో భాగంలో పెరర్ ఆర్ట్" క్రిమేషన్ వారు నిర్వహించిన తెలంగాణ నాటకానికి "హిమజ శరత్ సుంకరి దర్శకత్వం వహించగా ఇట్టి నాటకాన్ని' శరత్ సుంకరి రచించడం జరిగింది. పృష్ఠ నారి అనే చిత్రం ఒక ప్రయోగాత్మక నాటకం. ఇది పూరిగా తెలంగాణ బాషలో రాయడం జరిగింది. ఈ నాటకం మొక్క ఇలా వృత్తం  ఒక యువతి శిపుడి వరంతో చెట్టు గా మారితే ఎలా వుంటుంది. అలా చెట్టుగా మారిన యువతి నాటకం మొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో పుష్పనారి తల్లి, "గా జన్నారం మండం పానకల్ గ్రామానికి చెందిన తెలంగాణ నేషనల్ ఫోక్ ఆర్టిస్ట్ దుర్గం అన్నపూర్ణ రంగమ్మా గా పాత్ర పోషించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి. ముఖ్య అతిథులుగా తెలంగాణ బాష సంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరిక్రిష్ణ, కేంద్ర మాజి మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి హాజరవడం జరిగింది. అలాగే ఇతర జిల్లా కళాకారులు పాల్గోనడం జరిగింది.