పేదలకు భరోసా గా సీఎం సహాయ నిధి: జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Friday September 23, 2022
బోనకల్, సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసా గా మారిందని పేర్కొన్నారు. మండల పరిధిలో మొత్తం 33 మంది లబ్ధిదారులకు రూ.11,38,000/- లక్షల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం నాడు లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అసలు సీఎంఆర్ఎఫ్ అనేది ఉందని దానికి దరఖాస్తు చేసుకుంటే ఆర్దిక సహాయం అందుతుందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుపేద కుటుంబాలను సీఎం కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయ నిధి కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే మధిర నియోజకవర్గంలో ఇప్పటి వరకు వేలాది మందికి కోట్ల రూపాయలను ఆర్దిక సహాయం గా అందించాం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం సహాయ నిధి నుండి నేరుగా పేదలకు ఆర్దిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు టిఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని, అలానే రానున్న రోజుల్లో ప్రజలంతా సీఎం కేసీఆర్ కి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోతు కొండ, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, వేమూరి ప్రసాద్ , ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area