మాజీ ప్రధాని పీ.వి నర్సింహారావు వర్దంతి సందర్బంగా ఘన నివాళులు

Published: Friday December 24, 2021

కోరుట్ల,డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర వ్యక్తిత్వం సంక్లిష్ట తత్వం కలబోసిన ఠివి  మన పీ.వి.స్వాతంత్ర్య సమరయోధులు, దేశ చరిత్రను మార్చిన తెలంగాణ బిడ్డ పుట్టి నిండు నూరేళ్లు పూర్వ ప్రధాని స్వర్గీయ శ్రీ పాముల పర్తి వెంకట నర్సింహారావు వర్దంతి పురస్కరించుకుని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగ తిరుమల గంగాధర్, కొంతం రాజాం పట్టణ మండల అధ్యక్షులు సంయుక్తంగా మాట్లాడుతూ పి.వి తెలుగు బిడ్డ, తెలంగాణ వాది, 1957 లో ఎమ్మెల్యేగా తొలి విజయం, ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు అన్నారు. భారతదేశం అత్యంత క్లిష్ట మైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నపుడు భారత దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం, నవోదయ విద్యాలయాలకు ఆద్యులు పి.వి 8 భారతీయ భాషలతో పాటు, 8 విదేశీ భాషలలో మాట్లాడులో దిట్ట, బహుభాషా కోవిదుడు. పి.వి నరసింహరావు గారి గూర్చి ఒక పదబంధం లోనో, గ్రంథం లొనే విశ్లేషించగలిగే సులభమైన వ్యక్తి కాదు..." ఒక శక్తి పీ. వి.భవిష్యత్తు రోజుల్లో వారికి సంబంధించిన పరిశోధనలు గాని, పాఠ్య గ్రంథాల ద్వారా రాబోయే యువతకు ఆ మహనీయుని గూర్చిన స్ఫూర్తి నందించిన వారమవుతాము. పి.వి.నర్సింహారావు గారికి భారత రత్న పురస్కారం ద్వారా మహానియునికి నిజమైన నివాళి అర్పించిన వారి మవుతామని వారు ప్రజల హృదయాలలో చిరస్మరణీయులు కొనియాడారు ఈ కార్యక్రమంలోబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోగ్రాభి, ఉపాధ్యక్షులు ఎం ఏ నయీమ్, ఏస్ సి సెల్ అధ్యక్షులు పసుల కృష్ణప్రసాద్, కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాముల అమర్, మండల ఏస్ సి సెల్ అధ్యక్షులు మంథని గంగనర్సయ్య, పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, నాయకులు తుమ్మనపల్లి రాజేంద్రప్రసాద్ కండ్లె నరేష్, తదితరులు పాల్గొన్నారు.