ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంప

Published: Thursday October 06, 2022
భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాక ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీసులో విజయదశమి పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ  కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు .  చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.  అందరికీ విజయని అందించాలని.దుర్గా మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని, చేపట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు తాళ్లూరు శ్రీహరి . ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కుందూరు శ్రీనివాసరెడ్డి. ప్రధాన కార్యదర్శి మూల వెంకటరమణారెడ్డి , సీనియర్ రిపోర్టర్ సాంబారెడ్డి మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.