నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన గ్రామ సర్పంచ్ బండి రమేష్ పాఠశాల ప్రధా

Published: Thursday February 18, 2021
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షించాలి: బండి రమేష్, మద్దెల శివకుమార్
వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలు చెప్పినట్లు గా ప్రతి ఒక్కరు తమ పరిసరాల్లో మొక్కలు నాటి పచ్చని ప్రకృతి గా తయారు చేసి  పుడమితల్లికి పచ్చల హారం గా తొడగాలని అప్పుడే కాలుష్య నివారణ జరిగి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని  నిమ్మలగూడెం గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్ మరియు నిమ్మలగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి కోటి వృక్ష అర్చన సంకల్పంలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు సుజాతనగర్ మండలం లోని నిమ్మలగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో నూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లోనూ గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివ కుమార్ లు మొక్కలు నాటి వాటికి నీరు పోసి నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటికి ప్రతిరోజు నీరు పోసి పెంచాలని వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని అప్పుడే మన చుట్టూ పచ్చని ప్రకృతి ఏర్పడి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుందని వారు గ్రామస్తులను కోరినారు జామ నిమ్మ కొబ్బరి బాదం మరియు పూల మొక్కలను నాటి నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్పా ఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివ కుమార్ పంచాయతీ సెక్రెటరీ శ్రీ ఇజహెద్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి నాగేంద్ర, వైస్ చైర్మన్ శ్రీమతి రజిత సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ ఉద్దీన్ విద్యా కమిటీ సభ్యులు బండి రమేష్ గ్రామ పెద్దలు బండి వెంకన్న ఉష రాజేష్, రాహుల్  గ్రామస్తులు పాల్గొన్నారు