ప్రేమోన్మాది ని కఠినంగా శిక్షించాలి

Published: Wednesday August 18, 2021

వలిగొండ, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో దళితులపైన అనునిత్యం ఎక్కడో ఒకచోట దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని దళిత నాయకులు తక్కళ్ళ సంజీవ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరులో పట్టపగలు పోలీస్ స్టేషన్ కు కిలోమీటరు దూరంలోనే దళిత విద్యావంతురాలు రమ్యను ప్రేమ పేరుతో ప్రేమోన్మాది హత్య చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలపైన ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటుందో ఈ ఉదంతం తెలుపుతుందని ఆయన ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించారు. గ్రామస్థాయిలో మహిళల భద్రత కోసం కమిటీలు వేశామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత పాలన కు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ సంఘటన నిలిచిందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశ కేసులో జరిగిన న్యాయాన్ని దళిత విద్యార్థిని రమ్య విషయంలో కూడా అదే విధంగా న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల రక్షణకు దేశవ్యాప్తంగా కఠిన చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని, దళిత మహిళలపై దాడి చేసిన వ్యక్తులకు ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరిపి ఉరిశిక్ష విధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్ స్సి సెల్ మండల అధ్యక్షులు ఎడవెళ్లి శాంతి కుమార్, ఉపాధ్యక్షులు ఎర్ర మహేష్, నాయకులు కూచిమల్ల నగేష్, జువ్వి యశ్వంత్, బట్టు సాయి, బట్టు నరేష్, పోలెపాక బిక్షపతి, ఎడవెళ్లి హరీష్, ఎర్ర కృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.