ప్రభుత్వం అందిస్తున్న ఆసరాతో నిరుపేదలకు ఆర్థిక భరోసా --ఎమ్మెల్యే డా. సంజయ్

Published: Tuesday September 20, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండల పరిధిలోని చర్లపల్లి, కండ్ల పల్లి, హనుమాజిపెట్, పోరండ్ల, బాల పల్లి, హైదర్ పల్లి గ్రామాల్లో కొత్తగా మంజూరైన 771 ఆసరా  పెన్షన్ ప్రోసిడింగ్‌, కార్డ్ లను అదేవిధంగా 36 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయల విలువగల చెక్కులను, 28 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్  లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ  ప్రభుత్వం నిరుపేదల వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేసి చేయూత అందిస్తోందన్నారు. పేదల సంక్షేమం కోసం కెసిఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పిఏసిఎస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, హెచ్ సిఏ జిల్లా మెంబర్ దావా సురేష్, సర్పంచ్ ల ఫోరం చెరుకు జాన్, సర్పంచులు ధుమాల తిరుపతి, చందా రజిత శేకర్, బొడ్డు దామోదర్, సంధ్య రాణి, భూపతి రెడ్డి, రమ్య అంజయ్యా, ఎంపీటీసీ లు ఆరే సౌజన్యతిరుపతి, రెడ్డి రత్న, ఉప సర్పంచ్ లు రాజ నర్సయ్య, జగన్, రాజీ రెడ్డి, గంగారెడ్డి, సునీత, గంగాధర్, గ్రామ శాక ఆరే రవి, నరేష్, నాగార్జున, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంపీఓ రవి బాబు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.