పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం...: ఎమ్మెల్యే మంచిరెడ్డి* *ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయ

Published: Saturday September 03, 2022

ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్స్ లో ఇబ్రహీంపట్నం మండలానికి(889) మరియు ఆదిబట్ల(313), ఇబ్రహీంపట్నం(574) మున్సిపాలిటీలకు చెందిన 1776మంది నూతన పింఛనుదారులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎంపిపి, చైర్పర్సన్లు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డుల కౌన్సిలర్లు, అధికారులతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు, నేత, గీత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత దేశంలో మన తెలంగాణదేనని చెప్పారు. దివ్యాంగులకు రూ.3,016 పింఛను అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని. గత ప్రభుత్వాలు ఎందుకూ సరిపోని రూ.200 పింఛను ఇచ్చెదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2,016 ఆసరా పింఛన్లను అందిస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మైపాల్, ఎంపీపీ కృ పేష్, వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ఇబ్రహీంపట్నం చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఆదిభట్ల చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్, కౌన్సిలర్ శ్వేత భాను, భర్తకి జగన్, నీలం భాను, నల్లబోల్ మమత శ్రీనివాస్ రెడ్డి, జర్కోని రాజు, తులెకలాన్ సర్పంచ్ యాదయ్య. తదితరులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.