కాలనీలలో సమస్యలను అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ మోడల బాలకృష్ణ

Published: Monday June 21, 2021
బాలపూర్, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : కాలనీవాసులందరికీ కార్పొరేషన్ లలో సమస్యలు తీరకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు పోతానని స్థానిక కార్పొరేటర్ మోడల్ బాలకృష్ణ పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  ప్రతి ఆదివారం కాలనీ సమస్యల పరిష్కారం కొరకై వివిధ కాలాల్లో పర్యవేక్షించి అక్కడున్న కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వలన గత నాలుగైదు నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు, ఇప్పటినుంచి ప్రతి కాలనిలో ప్రతి ఆదివారం రోజు ఈ కార్యక్రమం ఉంటదని అన్నారు. వినాయక్ నగర్ కాలనీ, జై శ్రీ నగర్ కాలనీ, ఎం ఎల్ ఆర్ కాలనీ, కాలనీలలో పర్యటించి కాలనీ లో ఉన్నటువంటి తాగునీటి సమస్య అలాగే డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతున్నాయని వాటిని వెంటనే  క్లీన్ చేయాలని, శానిటేషన్ సిబ్బందికి పిచ్చి మొక్కలు, గడ్డి, మురికి, కాలువలు వీటన్నిటిని వెంటనే క్లీన్ చేసే విధంగా చేస్తానని చెప్పారు. కార్పొరేషన్ వార్డ్ ఆఫీసర్ గా వచ్చినటువంటి సుధాకర్ కు సమస్యలన్నిటినీ తీర్చాలని ఆదేశించారు. అదేవిధంగా పేదల అయినటువంటి రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వాళ్లను ఇంటింటికి తిరిగి గుర్తించాలని, డివిజన్కార్యకర్తలకు చెప్పకొనడం జరిగిందన్నారు. ఈ 10 రోజులలో డివిజన్ లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అందరు కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా ఎమ్మార్వో తో ఫోన్ లో మాట్లాడి అభయం లేదని కాలనీ వాసులతో అన్నారు. ముఖ్యంగా ఎం ఎల్ ఆర్  కాలనీ ప్రజలు గత సంవత్సరంలో కురిసినట్టు వంటి అకాల వర్షాలకు సుమారుగా ఎనిమిది, పది కోట్లు ఆస్తి నష్టం సంభవించింది. వారిని ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రైమరీ ఎంక్వైరీ కూడా చేయలేదుని అన్నారు. మీ అందరి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు పోతా అని చెప్పి వారికి హామీ ఇచ్చారు. వర్షాల వలన కాలనీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక సమస్యను శాశ్వత పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ అన్నారు. ఈ  కార్యక్రమంలో వినాయక్ నగర్ కాలనీ అధ్యక్షుడు జూపల్లి ప్రసాద్ రావు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ నాయక్, వెంకట స్వామి, రవీందర్ రెడ్డి, జై శ్రీ నగర్ కాలనీ  జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి, సాంబశివరావు, విజయ్, ఎం ఎల్ ఆర్ కాలనీ వాసులు బి కే శ్రీనివాస్ పాండురంగ చారి, లక్ష్మీ నరసింహ శర్మ, చారి, కాలనీ వాసులందరూ పాల్గొన్నారు.