వినాయక చవితి పందిళ్ళు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి

Published: Saturday August 27, 2022
మధిర ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ మండలం పరిధిలో శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో  ఆగస్టు 31 నుండి జరుగనున్న  వినాయక చవితి నవరాత్రి వేడుకలకు వినాయక పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా వివిధ శాఖల నుండి ముందస్తు  అనుమతి తీసుకోవాలని తహసిల్దార్ రాంబాబు ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ అంబటి రమాదేవి ఎస్సై సతీష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రతి సంవత్సరం మాదిరిగా మున్సిపల్, పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ శాఖ నుండి ముందుగా అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రమాదాలు జరుగకుండా మరియు ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ క్రింది తెలియజేసిన కొన్ని నియమ నిబంధనలు మరియు భద్రతా చర్యలను ఉత్సవ నిర్వాహకులు పాటించాలని వారు సూచించారు.నియమ నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలువినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి మరియు ఊరేగింపునకు తప్పని సరిగా పోలీసువారిఅనుమతితీసుకోవాలన్నాతీసుకోవాలన్నాక వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటుకు ముందుగా మున్సిపాలిటీ, ఫైర్, ఎలక్ట్రికల్ మరియు పంచాయితీ శాఖల అనుమతి పొందిన తరువాత మాత్రమే పోలీస్ శాఖ అనుమతి పొందవలసి  వుంటుందన్నారు.మండపాల వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు ప్రకారం రెసిడెన్సియల్ ఏరియా నందు పగలు 55, రాత్రి 45 డెసిబల్స్ కు మించకుండా ఉండే విధంగా బాక్స్ టైపు స్పీకర్లను ఉపయోగించాలని వారు సూచించారు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలన్నారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలనువిధిగాతెలియజేయాలన్నామండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లను మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు పాటించాలన్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలన్నారు. భద్రత కొరకు రాత్రి సమయాల్లో మండపాల వద్ద ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని, మండపాల వద్ద ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.మండపం యొక్క పటిష్టతను దృష్టిలో ఉంచుకుని పూజ నిర్వహించే సమయంలో మండపంపై ఎక్కువ మంది జనం లేకుండా చూడాలని,
వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదని వారు తెలిపారు. వినాయక పందిళ్ళ వలన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదని, ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు మరియు బ్యానర్లు ప్రదర్శించడం చేయరాదన్నారు. పరిసర ప్రాంతాల్లో అనుమానిత క్రొత్త వ్యక్తుల సమాచారం గురించి గాని వదలి వేసిన వస్తువుల గురించి గాని ఉత్సవ నిర్వాహకులు వెంటనే పోలీసు వారికి తెలియజేయాలన్నారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో ఎక్కువ శబ్దాలు వచ్చే లౌడ్స్పీకర్లు డిజె ఉపయోగించడం,  చేయరాదని, పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా  మరియు మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలని వారు తెలిపారు. వినాయక ఉత్సవ వేడుకల సందర్భంగా పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉత్సవ నిర్వాహకులు పైన పేర్కొన్న ముందస్తు జాగ్రత్తలు పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారి వెంకటేశ్వరావు విద్యుత్ అధికారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు