ఎన్నికల హామీలు విస్మరించిన ఎమ్మెల్యే

Published: Thursday January 20, 2022
రాజీవ్ నగర్ రైల్వే పై వంతెన నిర్మించండి: బిజెపి
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 19, ప్రజాపాలన : ఎన్నికల సమయంలో మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెళ్ళి దివాకర్ రావు పలు అభివృద్ధికి సంబంధించిన హామీలు ఇచ్చి వాటిని విస్మరించాడని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ విమర్శించారు. బిజెపి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ నగర్ రైల్వే పై వంతెన నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంతవరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిసినా నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీలేదు అని అన్నారు. గత ఎన్నికల సమయంలో హైటెక్ సిటీ - రాజీవ్ నగర్ మధ్య రైల్వే పై వంతెన 77 కోట్ల తో నిర్మిస్తామని చెప్పి ఎమ్మెల్యే ఇంటి గోడ పై ఫ్లెక్సీ నీ పెట్టుకొని ఎన్నికలు అయ్యి మూడు సంవత్సరాల గడిచిన ఇప్పటి వరకు కనీసం పనులు ప్రారంభించలేదు అని అన్నారు. అదే విధంగా మంచిర్యాల పట్టణ లో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని అసంపూర్తిగా ఉన్న లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుండి చున్నం బట్టి వరకు 100 ఫీట్ల రోడ్ ను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి, పురుషోత్తం, రజినిష్ జైన్, బియ్యాల సతీష్ రావు, రంగ శ్రీశైలం, రాచకొండ సత్యనారాయణ, గాజుల ప్రభాకర్, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, సోమ ప్రదీప్ చంద్ర, కుచాడి సతీష్, కుదురుపాక గంగన్న, ముదాం మల్లేష్, పచ్చ వెంకటేశ్వర్లు, బోయిని లలిత, అమీరిషెట్టి రాజు, పల్లి రాకేష్ నాగుల రాజన్న, దేవేందర్, అశోక్, రాకేష్ రేన్వ, జాడి సత్యనారాయణ, దేవరకొండ వెంకన్న, అక్కిరాల సాయి కిరణ్, మేన సూరి, దయాకర్, వాణి, స్వప్న రాణి, స్వరూప, దేవి సాయి, తదితరులు పాల్గొన్నారు.