డా.కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

Published: Saturday July 02, 2022
కోరుట్ల, జూలై 01 ( ప్రజాపాలన ప్రతినిధి ):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో  కోరుట్ల ఎమ్మెల్యే కలకుంట్ల విద్యాసాగర్ రావు నేతృత్వంలో యువ నాయకులు మరియు సమాజిక సేవ తత్పర్యులు డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో  జులై 1 వ తేది 2022 శుక్రవారం రోజున స్కిల్ టెక్నాలజీ ద్వారా జాబ్ మేళా ను ఘనంగా నిర్వహించారు. జాబ్ మేళాకు పెద్దఎత్తున హాజరైన యువతను ఉద్దేశించి యువ నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్ దిశనిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో  కోరుట్ల, మెట్ పల్లి, మల్లాపూర్ మరియు వివిధ మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.