మాటూర్ ఉన్నత పాఠశాలకు 30 డస్క్ బెంచెస్ వితరణ చేసిన సేఫ్ హ్యాండ్స్ ఫౌండేషన్ బృందం

Published: Wednesday November 17, 2021
మధిర నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూర్ హైస్కూల్ గణిత ఉపాద్యాయుడు మేడేపల్లి శ్రీనివాసరావు చొరవతో సేఫ్ హ్యాండ్స్ ఫౌండేషన్, ఖమ్మం వారిచే లక్షా 20 వేల రూపాయల విలువైన 30 డస్క్ బెంచీలు ఉచితంగా అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదీసాయికృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తూన్నటువంటి సేఫ్ హ్యాండ్స్ పౌండేషన్, ఖమ్మం బృందాన్ని అభినందించారు. ఇలాంటి దాతల సహకారంతోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు చేయూతనిస్తున్న సేఫ్ హ్యాండ్స్ బృందానికి విద్యాశాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం సేఫ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ పోతుకూచి శ్రీ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతిభ గల ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నందున ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు చక్కని విద్యను నేర్చుకునే అవకాశం ఉంది. కావున ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ తమ సంస్థ ద్యేయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపిటిసి అడపాల వెంకటేశ్వర్లు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణ రావులతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.