కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలి ** జిల్లా ఎస్పి సురేష్ కుమార్ ** శాంతిభద్రతలపై నేర సమీక్ష సమా

Published: Friday August 26, 2022

నిందితులపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువు కావాలంటే దర్యాప్తులో మరింత నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వాటర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో శాంతి భద్రత పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలను ఎస్ హెచ్ వో ల ను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి సాగు సరఫరా వినియోగం పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆసిఫాబాద్ జిల్లా ను గంజాయి రహిత జిల్లాగా చేయడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చూడాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా 100 కు కాల్ చేసేలా  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్ రావు, అదనపు ఎస్పీ ఏ ఆర్ భీమ్రావు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.