ఆరోపణలు నిరూపించకుంటే షర్మిలారెడ్డిని వదిలిపెట్టం దళిత సంఘాల నాయకుల హెచ్చరిక

Published: Tuesday November 08, 2022
బెల్లంపల్లి నవంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: రెడ్డి కుల అహంకారంతో షర్మిలా రెడ్డి, బెల్లంపల్లి దళిత ఎమ్మెల్యే అయిన దుర్గం చిన్నయ్య పై నిరాధారమైన ఆరోపణ చేసిన షర్మిలారెడ్డిని, ఆరోపణలు నిరూపించకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెల్లంపల్లి దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.
సోమవారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశాను విలేకరుల సమావేశంలో దళిత నాయకులు మాట్లాడారు, ఆదివారం వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో లో మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై భూములు కబ్జా చేస్తున్నాడని, దళిత బంధు లబ్ధిదారుల నుండి మూడు లక్షల రూపాయలు తీసుకొని దళిత బంధు ఇచ్చారని, నిరాధారమైన ఆరోపణ చేసిన షర్మిలారెడ్డి, ఆరోపణలు నిరూపించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పట్టణ పొలిమేరలు కూడా దాటనివ్వమని వారు హెచ్చరించారు. అసలు ఆమెకు
తెలంగాణలో తిరిగే అర్హత లేదని, తెలంగాణకు ద్రోహం చేసిన రాజశేఖర్ రెడ్డి కూతుర్ని అని, చెప్పుకుంటూ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న షర్మిలారెడ్డిని తరిమికొట్టాలని వారన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న షర్మిలారెడ్డి, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ప్రాజెక్టులను ప్రారంభించకుండా అడ్డుకొని, పోతిరెడ్డిపాడు ద్వారా 64 క్యూసెక్కుల నీళ్లను తీసుకుపోయి, తెలంగాణ ప్రజలను మోసం చేసింది నిజం కాదా అని వారు ప్రశ్నించారు. 
అలాగే నిర్మించాల్సిన హంద్రీ,నీవా, ప్రాజెక్టులు నిర్మించకుండా, తెలంగాణ ప్రజలను ముఖ్యంగా పాలమూరు ప్రజలను వలసలు పోయే విధంగా  మార్చింది మీ నాయన కాదా అని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా షర్మిలా రెడ్డి, దుర్గం చిన్నయ్య పై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదా దేశరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో వైయస్సార్ పార్టీ కి  తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు భీమశంకర్, రేవల్లి విజయ్, మాదరి రాకేష్, కుసుమ మధుసూదన్, కాంపల్లి రాజు, జిలకర తిలక్, దుర్గం సురేష్, తదితరులు పాల్గొన్నారు.