నులి పురుగులను పూర్తిస్థాయిలో నివారించాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Friday September 16, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్15 (ప్రజాపాలన, ప్రతినిధి) : 1 నుండి 19 సంవత్సరాల ప్రతి పిల్లలకు నులి పురుగు నివారణ మాత్రలు వేయాలని నులి పురుగులను పూర్తి స్థాయిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ అన్నారు. గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వాడిగుడా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆల్బమ్ డోజిల్ మాత్ర ఎటువంటి హాని చేయదన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు  ఆల్బమ్ డోజల్ మాత్ర వేయడం వల్ల కడుపులో పెరిగే నట్టలను పూర్తిస్థాయిలో నివారించే అవకాశం ఉందన్నారు. పిల్లలు ఆరుబయటవట్టి కాళ్ళతో ఆడుకోవడం, మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లాంటి వాటివల్ల నులి పురుగులు తయారవుతాయని అన్నారు. జిల్లాలో 1 లక్షా71వెయ్యి 671 మందికి మాత్రలు వేయనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మాత్రమే వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్, సహాయ సంచాలకులు మర్యాల ఉదయ్ బాబు, జిల్లా వైద్య అధికారి సుధాకర్ నాయక్, డాక్టర్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.