కార్పొరేషన్ లలో ఉచిత టికా సెంటర్స్

Published: Tuesday September 21, 2021
బాలాపూర్:సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : బడoగ్ పెట్ కార్పొరేషన్ పరిధిలోని నాదరుగుల్ 8వ, 9వ, 27వ డివిజన్ లలో వ్యాక్సిన్ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక కార్పొరేటర్లు ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ కరోనా టీకా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల టీకానే శ్రీరామరక్షగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, గ్రామస్తులు, స్థానిక కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గుడేపు ఇంద్రసేన, తోట శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.