తూటికుంట్ల గ్రామంలో చేతిపంపు ప్రారంభం హోప్ చారిటబుల్ సొసైటీ ఖమ్మం వారి సహకారంతో

Published: Friday May 27, 2022
బోనకల్, మే 26 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో ఎస్సీ కొత్త కాలనీ ప్రజల సౌకర్యార్థం కొరకు హోప్ చారిటబుల్ సొసైటీ ఖమ్మం వారి సహకారంతో గురువారం చేతిపంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బి ఎర్నెస్ట్ పాల్ ,చారిటబుల్ సంస్థ సిబ్బంది, బోనకల్ మండలం ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, గ్రామ సర్పంచ్ నోములు వెంకట నరసమ్మ, ఉప సర్పంచ్ తుళ్లూరు కొండలరావు, బోనకల్ మాజీ ఎంపీపీ తూల్లూరు రమేష్, మాజీ ఎంపీటీసీ గుమ్మా ముత్తారావు, కాలనీ ప్రజలు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area