దివ్యాంగునికి ఆర్థిక సాయం అందజేత శ్రీనివాసరావును సన్మానించిన సెక్రటరీ

Published: Tuesday December 20, 2022
తల్లాడ, డిసెంబర్ 19 (ప్రజా పాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన భూక్య మనోజ్ అనే నిరుపేద దివ్యాంగునికి  విజయ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక సాయం అందించారు. ఈ నగదును సేవా సంస్థ చైర్మన్ దొబ్బల శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లాడ మండలంలోని రామచంద్రాపురం గ్రామ కార్యదర్శి సురేష్, ఐకెపిసిసి కురివెళ్ల నరసింహారావు, అంగన్వాడి ఆశ కార్యకర్తలు, గ్రామదీపిక సత్తెనపల్లి చిన్న వేలాద్రి తదితరులు ఆయనను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగ సుధా, సభ్యులు అనుమోలు రాంబాబు, బాబాసాహెబ్, రవి, రమ్య, కళ్యాణి పాల్గొన్నారు.