మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు చైర్మన్ మొండితోక లత

Published: Friday July 29, 2022

మధిర  జులై 28 ప్రజా పాలన ప్రతినిధి  మున్సిపాలిటీలో పరిధిలో గురువారం నాడు ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత కమిషనర్ అంబటి రమాదేవి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో వర్తక సంగం కిరాణా జాగిరి మర్చంట్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని వారు అన్నారు. అందువల్ల వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో ప్రజలు, వ్యాపారులు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.