రక్త దాతలను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా న

Published: Thursday February 23, 2023
బోనకల్ ,ఫిబ్రవరి 22 ప్రజా పాలన ప్రతినిధి : స్థానిక ప్రభుత్వ కళాశాల నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సజీవ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరం లో రక్త దానం చేసిన దాతలకు ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ బుధవారం ధ్రువీకరణ పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్త దానం మన సామాజిక బాధ్యత అని, ఆరోగ్య వంతులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్త దానం చేయడం పౌరుని గా మన అందరి బాధ్యత అని ఆమె అన్నారు. సజీవ సర్వీస్ సంస్థ చైర్మన్ ఇరుగునవీన్ కుమార్ మాట్లాడుతూ ముందుగా రక్త దానం చేసిన విద్యార్థుల ను అభినందించారు.విద్యార్థులు అన్ని సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని, ప్రతి ఒక్కరికి రక్త దానం గురించి దాని ఆవశ్యకత ను తెలియజేయాలని అన్నారు.కళాశాల పూర్వ విద్యార్థి నవీన్ ను అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.చదువు కునే రోజుల్లోనే సేవా భావం తో ఎదుటి వారికి సహాయపడాలని అన్నారు. కరోన సమయాల్లో తన మిత్రుల సహాయం తో మండలం లో అనేక మందికి నిత్యావసర వస్తువులు, విద్యార్థుల కు నోట్ పుస్తకాలు,అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సేవా భావం తో మెలగాలని అధ్యాపకులు విద్యార్థుల కు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎ. శ్రీనివాసరావు, ప్రేమ్ కుమార్ రెడ్డి,అంతోటి తిరుపతి రావు, యస్. రాజేందర్, ఎ.మురళి, డి. పద్మావతి, సంస్థ చైర్మన్ ఇరుగు నవీన్ కుమార్, సభ్యులు, తగరం రమేష్, కటకం రత్నాకర్,దారెల్లి రాకేష్, కంచర్ల నిఖిల్, పవన్ కళ్యాణ్,రాకేష్, భాను,మహేష్ తదితరులు పాల్గొన్నారు.