కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ సభను బిసిలు బహిష్కరించాలి. ..ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కో

Published: Friday April 14, 2023
జన్నారం, ఏప్రిల్ 13, ప్రజాపాలన: 
 
 
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నేడు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సత్యగ్రహ సభను బీసీ కూలాల వారు బహిష్కరించాలని ఆ సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు.  గురువారం  మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఒక లక్ష మందితో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో బిసి కులస్తులకు  తీవ్రంగా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మురారి దేశాయ్, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి ఉద్దండుల పాలనలో
 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి, బీసీల మధ్య , అగ్రవర్ణ ధనిక కులాల మధ్యనే రాజకీయ పోటీ ఉండాలని భావించి బీసీ కులాల వారికి రాజకీయ అధికారం దక్కనీయకుండా కుట్ర పన్నారని విమర్శించారు. 75 ఏళ్లు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో బిసీలు రాజ్యాధికారం పొందడంలో ఆమడదూరంలో నెట్టివేయబడ్డారని ఆయన విమర్శించారు. నేడు  బీసీ కులాల సమాజం చైతన్యవంతమైనదని, అగ్రకులాలు మాత్రమే రాజ్యాధికారం పొందడం పై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎక్కడైతే అధికార పోగొట్టుకున్నారో అక్కడే అధికారం సాధించుకోవాలని తపనతో  ఆశతో అడుగులు వేస్తున్నామన్నారు. కాంగ్రెస్సు పార్టీ ఆది నాయకులు చేసిన తప్పిదం వలన  బీసీ కులాల వారు రిజర్వేషన్ల ద్వారా చట్టసభలలో అడుగుపెట్టలేక పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నని వారన్నారు.నేటికి నెహ్రూ, గాంధీ కుటుంబాల వారే ఈ దేశాన్ని పాలించాలనే ఆలోచన దేశ ప్రజలలో 20 శాతం ఇంకా మిగిలివుందన్నారు. ఇది కాపాడుకోవాలంటే 2024 లోక్సభ ఎన్నికల నాటికి  అసెంబ్లీ పార్లమెంటులలో బీసీ కులాల వారికి రిజర్వేషన్లకై  రాహుల్ గాంధీ, ప్రియాంక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే అన్ని రాష్ట్రాలలో పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు బిసిల రిజిస్ట్రేషన్ లో పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్, అడేపు లక్షినారయణ, మూల భాస్కర్ గౌడ్, లాసేట్టి సత్యనారాయణ, వి గోపాల్, శ్రీపాద రమేష్, శ్రీపాద శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.