డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : మద్ది యుగేందర్ రెడ్డి

Published: Saturday July 03, 2021
మేడిపల్లి, జూలై 2 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్థానిక కార్పొరేటర్ మద్ది యుగేందర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి 3వ విడత కార్యక్రమంలో భాగంగా రెండవ రోజున కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి వార్డు కమిటీ సభ్యులు మరియు మున్సిపల్ అధికారులతో కలిసి డివిజన్లోని ప్రతి గల్లి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో కరెంట్ , డ్రైనేజి, నీటి సరఫరా సక్రమంగా అందేవిధంగా తగినచర్యలు తీసుకుంటున్నామని, వర్షం నీరు సాఫీగా డ్రైనేజ్ గుండా పోయేవిధంగా సమస్యత్మక ప్రదేశాలను గుర్తించి మున్సిపల్ అధికారుల దృష్టికితీసుకెళ్లి మరియు ఇంజనీరింగ్ విభాగంతో కుడా సంప్రదించి గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారానికై కృషిచేస్తున్నామని కార్పొరేటర్ డివిజన్లోని మహిళలకు వివరించారు. ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది వచ్చిన తనను ఫొన్ లో కుడా సంప్రదించవచ్చని తెలిపారు. రోడ్డు నంబర్ ఒకటి వద్ద ఆగివున్న వర్షపునీరు సాఫీగా పొయేవిధంగా సిబ్బందితో మరమత్తులు చేయించారు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ తో స్ప్రే చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కరెంట్ సరఫాకు ఆటంకం కలగకుండా చెట్ల కొమ్మలను తొలగించాలని, నాటిన మొక్కల పాదులు క్లీన్ చేసుకుని మరియు ట్రీ గార్డ్ అమర్చి మొక్కలను పరిరక్షించుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించాారు.