విద్యా శాఖ లో ఖాళీలు భర్తీ చేయాలి

Published: Saturday January 29, 2022

ఎస్.టీ.యూ.టి.ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజోజి భూమయ్య

కోరుట్ల, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): దీర్ఘకాలంగా విద్యాశాఖ లో ఖాళీగా ఉన్న పిజి ఎచ్ఏం, ఎంఈఓ, డీయైఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్.టీ.యూ.టి.యస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజోజి భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్.టీ.యూ.టి ఎస్ కోరుట్ల మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ ని ఎంపిడిఓ నీరజ, ఎంఈఓ గంగుల నరేశం, ఎస్టిటీఓ లావణ్య ల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 317 జీ. ఓ  ద్వారా జరిగిన ఉపాధ్యాయుల విభజన అనంతరం ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విభజన సమయంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేసవి సెలవుల్లో స్కూల్ సీనియారిటీ, సర్వీసు సీనియారిటీ పరిగణనలోకి తీసుకొని సాధారణ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలకు సర్వీస్ పర్సన్లను నియమించాలని, పెండింగ్ పిఅర్సి, డి ఎ బకాయిలను విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్.టీ.యూ.టి ఎస్ కోరుట్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలెపు శివరామకృష్ణ, నల్ల సాయికుమార్, కథలాపూర్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్ల రాజకిరణ్, అడెపు రాజశేఖర్, జిల్లా నాయకులు అకీల్ అహ్మద్, రవూఫ్, సిరిపురం రాజేష్, ప్రభాకర్, తడుక రమేశ్, కట్కమ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.