తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ - జడ్పీ చైర్ పర్సన్ దావ వస

Published: Tuesday June 22, 2021
జగిత్యాల, జాన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రధాత తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ అని ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నీలిచారన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన జయశంకర్ సార్ సేవ‌ల‌ను తెలంగాణ ప్రజల భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచలంచలుగా ఆశయ ఆలోచనలకు పదునుపెడుతూ రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయినారని అందరి హృదయాలలో చిరకాలంగా పూర్తిగా నిలిచారని వసంత తెలియజేశారు.