ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల స్వీకరణ జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమశాఖ అధికా

Published: Friday January 06, 2023

2023 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు) ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి విదేశీ విద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ / డాక్టోరల్ కోర్సులు చదవడం కొరకు ఉ పకార వేతనాలు / ఆర్థిక సహాయం మంజూరు కొరకు అర్హత ప్రమాణాలు కలిగి, విదేశీ విశ్వవిద్యాలయాలలో సంబంధిత కోర్సులలో అడ్మిషన్ తీసుకున్న అర్హత గల మైనార్టీ అభ్యర్థులు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అన్ని అర్హతలు వారు ధృవపత్రాలతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గం॥లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.