షటిల్ పోటీలను ప్రారంభించిన సర్పంచ్ మారెళ్ళ మమత..

Published: Monday December 26, 2022
తల్లాడ, డిసెంబర్ 25 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పాటుచేసిన షటిల్ పోటీలను  గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ క్రీడా పోటీలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.  యేసుక్రీస్తు పుట్టుక ఎంతో గొప్పదని, ఆయన సూచించిన ప్రేమ, శాంతి మార్గంలో నడవాలన్నారు. ఉద్యోగంలో స్థిరపడిన వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులు ముందుకు సాగాలన్నారు. గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమన్నారు. అనంతరం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మేకల ప్రసాదరావు, పాల్వంచ ఎస్ ఐ ఇస్నపల్లి నాగభిక్షం, డాక్టర్ నాగరాజు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.*