సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు జాతీయ సేవరత్న అవార్డు

Published: Friday February 17, 2023

కోరుట్ల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి):
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంజలి మీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రధానం సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, సీనియర్ రిపోర్టర్ కటుకం గణేష్ కు బుధవారం నాడు కరీంనగర్ లో నిర్వహించిన జాతీయ సేవారత్న అవార్డు ను మాజీ మంత్రివర్యులు, మంథిని నియోజకవర్గం శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రక్తదాన ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు 4050 మంది కి రక్తదాతలతో రక్తదానం చేయించి అనేక మందికి ప్రాణదాతగా నిలిచి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు అవార్డులు అందుకున్న సందర్భంగా జాతీయ సేవరత్న అవార్డుకు ఎంపిక చేసి అవార్డును ప్రధానం చేస్తూ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కటుకం గణేష్ కు బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి షికారి గోపికృష్ణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మార్గదర్శి యూత్ నాయకులు లవంగ సాగర్ యువజన సంఘ నాయకులు సనావుద్దిన్, జాలా వినోద్, ఆనంద్, నాగరాజు, క్యాతం సృజన్, మహమ్మద్ అలీ, బాణాల శ్రీధర్, రాజశేఖర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు