జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసిన మాలమహానాడు జాతీయ అధ్యక్షులుడు చెన్నయ్య

Published: Friday October 08, 2021
హైదరాబాద్, అక్టోబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : తెలుగు రాష్ట్రాలలో (ఏ పీ, టి ఎస్) ఎస్ సి ల ను (ఏ బి సి డి లు)గా వర్గీకరణ చేయవద్దని ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మాలమహానాడు బృందం. తెలుగు రాష్ట్రాలలో ఎస్సీలను (ఏ బి సి డి) ల వర్గీకరణ వద్దని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం కోర్టు తీర్పులకు గతంలో ఎస్సీ కమిషన్ నివేదికలను వ్యతిరేకమని అన్నారు. గతంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో సమాధానమిస్తూ ఎస్సీల వర్గీకరణ సాధ్యం కాదని ఎందుకంటే దేశంలో మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని ఇది జాతీయ సమస్యని పార్లమెంటులో ప్రకటించారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు శ్రీ జి చెన్నయ్య న్యూఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ శాంప్లా  (Vijay Shampla)కు అక్టోబర్ 6వ తేదీ నాడు విన్నవించడం జరిగిందన్నారు. అంతేకాకుండా గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ సుప్రీంకోర్టు వర్గీకరణ కాకుండా అత్యంత వెనుకబడిన ఉప కులాల సాధికారతకు ఎన్నో నిర్మాణాత్మకమైన సూచనలు చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వర్గీకరణ శాస్త్రీయ బద్ధత, చట్టబద్ధత కాలం చెల్లిన డిమాండు అన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ సైతం ముఖ్యంగా తెలంగాణలో విద్య ఉపాధి వివిధ సంక్షేమ పథకాలలో మాలల కంటే మాదిగలు వారి జనాభా కంటే మించిన వాటితో లబ్ధి పొందుతున్నారని పీడిత వర్గాలు ఏకం కాకుండా చేయుటకు పన్నిన మను వాదుల రాజకీయ ఓటు బ్యాంకు కుట్రేనని చెన్నయ్య జాతీయ ఎస్సీ చైర్మన్ కు విన్నవించామన్నారు. జాతీయ ఎస్సీ చైర్మన్ విజయ్ శాంప్లాను చెన్నయ్యతో పాటు ప్రముఖ దళిత నాయకుడు ప్రకాష్ కూడా వెంట ఉన్నారు.