గ్రామీణ ప్రాంతాల్లో కి వచ్చి వ్యాక్సినేషన్ చేయడం హర్షణీయం

Published: Friday September 24, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): గ్రామీణ ప్రాంతాల్లో కి వచ్చి వ్యాక్సినేషన్ చేయడం హర్షణీయం అని, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం నేరుగా వచ్చి వారికి వ్యాక్సిన్ చేయడం ఎంతో శుభసూచకమని కల్లూరు గ్రామ సర్పంచ్ వనతాడుపుల అంజయ్య అన్నారు. కల్లూరు గ్రామ పంచాయతీ  ఆవరణలో ఏర్పాటు చేసిన వాక్సిన్ కేంద్రన్ని బుదవారం రోజున డాక్టర్ సునీత ప్రారంభించారు. ఈ సంధర్భంగా డాక్టరు సునీత మాట్లాడుతూ గ్రామంలోని స్త్రీలు, పురుషులు యువకులు అత్యధిక శాతం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల ఎంపీడీవో నీరజ, వార్డు మెంబర్లు, కార్యదర్శి, రెయిన్బో యూత్ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.