శ్రీకర హాస్పిటల్లో మిరాకిల్ చైల్డ్ కేర్ పీడియాట్రిక్ ప్రారంభోత్సవం

Published: Tuesday October 19, 2021
మేడిపల్లి, అక్టోబర్18 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడిపల్లి వరంగల్ ప్రధాన రహదారిలో 23వ డివిజన్ కెఎల్ఎం రోడ్డులో ఉన్న శ్రీకర హాస్పిటల్లో మిరాకిల్ చైల్డ్ కేర్ పీడియాట్రిక్ విభాగాన్ని ప్రారంభించడానికి ముఖ్యఅతిథులుగా పీర్జాదిగూడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి ఏసీపీ శ్యామ్ సుందర్ రావు, మేడిపల్లి సి.ఐ అంజి రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కార్పొరేటర్లు అనంత రెడ్డి, హరిశంకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, యసారం మహేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పీర్జాదిగూడలో ఏర్పాటు చేయడం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల అదృష్టమని, సోమవారం శ్రీకర ఆస్పత్రిలో మిరాకిల్ చైల్డ్ కేర్ పీడియాట్రిక్ విభాగాన్ని పెద్ద ఎత్తున ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని, అనివార్య కారణాల వల్ల 600 నుంచి 800 గ్రాముల శిశువులు జన్మించినప్పుడు వారికి అవసరమయ్యే ఇంక్యుబేటర్లు అన్ని సౌకర్యాలు దీంట్లో ఉన్నాయని, ఈ చుట్టూ పక్కల ఎక్కడలేని ఈ విధంగా అత్యాధునిక సదుపాయాలు మరియు ఎంతో అనుభవంగల డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నారని, ఒకప్పుడు పీర్జాదిగూడలో చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బందులు కలిగితే సరైన హాస్పిటల్ లేక ఇబ్బంది పడే వారని ఇప్పుడు శ్రీకర హాస్పిటల్ ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ విభాగం వల్ల చిన్న పిల్లలకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు సూచించారు.