నా బర్త ను తీసుకెళ్లి ఏం చేయాలనుకున్నారు. ....పోలీసులను ప్రశ్నిస్తున్న శైలజ

Published: Saturday September 24, 2022
బెల్లంపల్లి,  సెప్టెంబర్ 23,  ప్రజా పాలన ప్రతినిధి:
 రాత్రి పూట  మఫ్టి లోఉన్న పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపకుండా వచ్చి బలవంతంగా నా భర్తను తీసుకెళ్ళారని, తీసుకెళ్లి ఏం చేయాలనుకున్నారో తెలపాలని, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన బొమ్మెన శైలజ అనే యువతి  పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
బొమ్మెన శైలజ  శుక్రవారం ఉదయం " ప్రజా పాలన ప్రతినిధి"తో మాట్లాడుతూ, తన భర్త బొమ్మెన సంతోష్ ను గత మూడు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నానని, అతనికి గతంలోనే ఒక అమ్మాయి తో అక్రమ సంబంధం ఉందంటూ ఒక అమ్మాయి తో వారికి అనుకూలంగా ఫిర్యాదులు చేయించి, పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తూ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారని, తన  భర్తను చేయని నేరానికి  జైల్లో పెడుతూ బెయిల్ కూడా దొరక నటువంటి కేసులు పెడుతూ అనవసరంగా శిక్షిస్తున్నారని  ఆమే ఆవేదన వ్యక్తం చేశారు.
 ఇదిలా ఉండగా గురువారం రాత్రి నేను నా భర్త ఇంట్లో ఉండగా గురువారం సాయంత్రం 8 గంటల సమయంలో  దాదాపు 15 మంది పోలీసులు నాలుగు వాహనాల్లో ఇంటిని చుట్టుముట్టీ, బలవంతంగా ఇంట్లోకి చొరబడి నా భర్తను తీసుకెళ్లారని, ఎవరు అని ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా ఆడపిల్లనని చూడకుండా నన్ను, నానా దుర్బాశలాడుతూ నెట్టివేసి తన భర్తను తీసుకువెళ్లారని, వెంటనే మా కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి విషయాన్ని తెలపడంతో, హైదరాబాదులో ఉన్న అడ్వకేట్ రఘునందన్ గారికి విషయం తెలుపగా స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం మళ్లీ తీసుకువచ్చి నీ భర్త నీకు అప్పగిస్తున్నామని  అప్పగించి వెళ్లిపోయారని తెలిపారు, 
ఒకవేళ న్యాయవాదులు తక్షణమే స్పందించకపోతే, నా భర్త పరిస్థితి ఏ విధంగా ఉండేదో అని ఆమె కన్నీటి పర్యంతరమైంది, ఈ సంఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అతని కుటుంబ సభ్యులకు, మంత్రులకు తెలియజేస్తానని, వారు చెప్పే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా, అని ఆమె మండిపడ్డారు.
నా భర్తకు నెన్నెలా, బెల్లంపల్లి, పోలీసులతో ప్రాణహాని ఉందని, నా భర్త బొమ్మెన సంతోష్ కు ఏ విధంగానైనా, ప్రాణా నష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత నెన్నేల, బెల్లంపల్లి, పోలీసులే  బాధ్యత వహించాలని అన్నారు, 
జరిగిన సంఘటనను, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి, కేంద్రమంత్రికి, మానవ హక్కుల సంఘానికి, పోలీసు ఉన్నతాధికారులకు, తెలియజేస్తానని ఆమె అన్నారు.