ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *మంచాల మండలం ఆంబోత్ తండా సీపీఎం గ్రామ శాఖ ఆధ్

Published: Friday November 04, 2022
ఈ సందర్బంగా సీపీఎం మంచాల మండల కమిటీ సభ్యులు సిలివేరు రాజు మాట్లాడుతు గ్రామంలో ముఖ్యంగా  2,6,7,8 వార్డ్ లలో సీసీ రోడ్డు లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు పడితే రోడ్డులు మొత్తం గుంతలుగా మరి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది అన్నారు డ్రైనేజీ సమస్యలు కూడా అన్ని వార్డులులో ఉన్నాయి కొన్ని వార్డ్ లలో డ్రైనేజీ లు పగిలిపోవడం వల్ల దూర్వసాన తో ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేదు తాగునిటి సమస్య కూడా తీవ్రంగా ఉంది సాగర్ వాటర్ వస్తున్న సరిపోవడం లేదని ప్రజలు మొత్తుకుంటున్నారు గ్రామంలో 4 బోర్లు పాడైన కాని ఇక్కడున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదు ఈ బోర్లు బాగైతే వాటర్ సమస్య లేకుoడా ఉంటది ప్రధానంగా 3వ వార్డ్ లో కరెంట్ స్తంబాలు,విది లైట్లు లేవు రాత్రి అయితే బయట ఉండే పరిస్థితి కూడా లేదు దీనితో పాటు 6మరియు7 వార్డులో ప్రధానముగా కరెంట్ స్తంబాలు ఇండ్ల పై నుండే ఉన్నాయి దీనివల్ల ఇంటి పైకి పోలేని పరిస్థితి ఉంది పలుమార్లు సర్పంచ్ కు అక్కడున్న ప్రజలు చెప్పిన పట్టించికొని పరిస్థితి ఉంది దింతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది లేక ఎక్కడి చెత్త అక్కడే ఉండి పల్లె ప్రకృతి వనం పరిశుభ్రత లేకపోవడం వల్ల ఇండ్లలోకి పాములు వస్తున్నాయ్ ప్రజలు కూడా అనారోగ్యలకు గురవుతున్నారు అర్హులైన ప్రజలకు పెన్షన్స్, రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైన ఈ సమస్యలు పరిష్కరించాలి లేకపోతే భవిష్యత్తులో అక్కడున్న ప్రజానీకాని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి రవీందర్ నాయకులు రాజేష్, రమేష్ ,ముంగుతా,సురేష్,సిద్దు,మహేష్ పృథ్వీరాజ్, తరుణ్, కుమార్ ప్రవీణ్, సురేష్,విగ్నేష్,నితిన్ పాల్గొన్నారు.