మనఊరుమనబడిపథకానికిప్రజాప్రతినిధులు తోడ్పడునందించాలిఅడిషనల్ కలెక్టర్ స్నేహలత

Published: Wednesday July 20, 2022

మధిర రూరల్ జులై 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మన ఊరు మనవడి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన మనఊరు మనబడి మనబస్తీ మనబడికి పథకానికి ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి కోరారు. మండలంలోని దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో మంగళవారం మధిర నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా విద్యాశాఖఅధికారి  యాదయ్య  అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మధిర నియోజకవర్గ స్థాయి మన ఊరు మన బడి పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ఏ మేరకు అభివృద్ధి పనులు జరిగాయని ఆయా ప్రధానోపాధ్యాయులను విద్యా కమిటీ చైర్మన్లను అడిగి తెలుసుకున్నారు. మన ఊరు మనబడి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేవిధంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీడీవోలు, జడ్పిటిసిలు, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితో క లత మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి ఐదు మండలాల విద్యాశాఖ అధికారులు ఏఈలు జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ సిహెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.