గొల్ల‌కురుమలు రాజకీయ, సామాజికంగా ఎదగాలి కాల్వనర్సయ్య వర్దంతి సభలో షాద్నగర్ ఎంఎల్ఏ అంజన్నయ

Published: Thursday July 07, 2022
కరీంనగర్ జూలై 6 ప్రజాపాలన విలేకరి :
 అనేక రంగాల్లో వెనుకబడిన గొల్ల కురుమలు ఆర్థికంగానూ సామాజికంగానూ రాజకీయంగా ఎదిగేందుకు పోరాడాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు, షాద్నగర్ ఎమ్మెల్యే అంజన్న యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని రెవెన్యూ గార్డెన్లో జరిగిన యాదవ నేత స్వర్గీయ కాల్వ నరసయ్య యాదవ్ మూడో వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ మాట్లాడుతూ గొల్ల కురుమలు చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సంఘ నేతలు కృషి చేయాలని ఆయన కోరారు. ఆర్థికంగా వెనుకబడిన గొల్ల కురుమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిచ్చేయంతో ఉందని చెప్పారు. గొల్ల కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు గొల్ల కురుమలు ముందుకు రావాలని కోరారు. గొల్ల కురుమల్లో అపారమైన తెలివితేటలు ఉన్నాయని వాటిని వినియోగించి అభివృద్ధి బాటలో పయనించేందుకు ముందుకు రావాలన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న గొల్ల కురుమల సంక్షేమ కోసం కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ చేసిన కృషి ఎంతో అపారమైందని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. నరసయ్య కుటుంబ సభ్యులకు మనము అండగా ఉండాల్సిన అవసరం  ఎంతయినా ఉందన్నారు. విద్యా రంగంలో గొల్ల కురుమలు వెనుకబడిపోయారని అటువంటివారిని గుర్తించి విద్యను అందించేలా మన వంతు కృషిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కురుమ సంఘం నాయకులు భూస అంజయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా ఎన్జీవో నేత శ్రీనివాస్ యాదవ్,జక్కుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.