*మల్లారెడ్డి గూడ లో వ్యవసాయ క్షేత్ర దినోత్సవం* -భూసారాన్ని పెంచే ఎరులనే వాడండి -వ్యవసాయధికార

Published: Saturday November 26, 2022

చేవెళ్ళ నవంబర్ 25(ప్రజాపాలన): -

చేవెళ్ళ మండలం మల్లారెడ్డి గూడ గ్రామంలో సర్పంచ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర పరిశీలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్ళ మండల వ్యవసాయ అధికారి జి.తులసి నిర్వహించారు. కార్యక్రమంలో  భాగంగా రైతులకు వ్యవసాయ వంగడాలు, పంట మార్పిడి విధానం, పచ్చి రొట్టె ఎరువు, సేంద్రియ ఎరువుల ఉపయోగం గూర్చి వివరించారు. పచ్చిరొట్టె ఎరువులు వానకాలం వరి పంటలకు ఎక్కువగా వినియోగించాలాన్నారు. పచ్చిరొట్టె ఎరువులకు జనము, కానుగ ఆకులు పంటకు మంచి ఎరువులన్నారు. పశువుల పేడ పంటలకు వాడడం వల్ల మంచి దిగుబడి వస్తుందన్నారు. నేలలో నత్రజనిని స్థిరకరించి నేల సారవంతన్ని పెంచుతుందన్నారు. జనము విత్తనం విత్తిన 30 నుండి 45 రోజుల్లో పూతదశలో పొర్ల దున్నాలన్నారు. ఈ విధానం వల్ల కుత్రిమ ఎరువుల వాడకం అవసరం లేదన్నారు. పాస్పారస్ సాలుబులైడింగ్ బాక్టీరియా నేలలో ఉండడం వల్ల మొక్క ఏపుగా ఎదుగుతుంది. పొలంలో రైతుకు 'డిఎపి' వెదజల్లే ఖర్చు తగ్గుతుందన్నారు. పంటలకు రైతు లు ఎరువులు వేయకుండా దశల వారిగా వినియోగించాలన్నారు. దీని వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. పచ్చిరొట్టె ఎరువులు వాడకం వల్ల నేల సారవంతంగ ఉంటుందన్నారు. కుత్రిమ రసాయన ఎరువుల వాడకం వల్ల నేల సారవంతం కోల్పోతుందన్నారు. పొలం దున్ని వృధాగా ఉంచడం వల్ల మృతిక క్రమక్షయం పేరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఇ లు స్వాతి, రమేష్, వరుణ్, ఉప సర్పంచ్ వెంకటేష్, రాంరెడ్డి, మల్లారెడ్డి, చల్మా రెడ్డి, ఎర్ర రమేష్, ఎర్ర గోపాల్,చిల్కూర్ గోపాల్, ఎర్ర మల్లేష్, నర్సింహా రెడ్డి, బాల్వంత్ రెడ్డి, మాధవరెడ్డి, పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.