విద్యార్థులకు సోలార్ స్టడీ లైట్స్ పంపిణీ

Published: Wednesday October 06, 2021
బోనకల్, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సోలార్ స్టడీ లైట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ సోలార్ లైట్స్ ఎంతో ఉపయోగకరం అని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, గ్రామ ఎంపీటీసీ సభ్యులు కర్లకుంట దేవమణి, ఎస్ఎంసి చైర్మన్ గంగ దేవుల నరసింహారావు, వారి చేతుల మీదగా సోలార్ స్టడీ లైట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.నారాయణ, ఉపాధ్యాయులు ఎం.నరేష్, వి.రాంబాబు, వి.రవి, కెవిపిఎస్ నాయకులు కర్లకుంట.నరేష్ తదితరులు పాల్గొన్నారు.