కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

Published: Friday April 08, 2022
సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ .
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 07, ప్రజాపాలన : కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్, స్విపర్లు, పేషంట్ కేర్ లలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. సాయి ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నా కార్మికులకు గత మూడు నెలలు నుండి ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదని, ఇలా కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సరియైన విధానం కాదని విమర్శించారు. జిల్లాలోని కాంట్రాక్టర్ కార్మికులకు సకాలంలో జీతం ఇవ్వకపోవడం వలన కార్మికులు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్, నరేష్, శిలా, సుమలత, స్వరూప, లక్ష్మి, దుబ్బమ్మ, సువర్ణ, శంకర్, నరసయ్య, తాజ్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.