ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *కవయిత్రి మోల్లమాంబ జయంతిని ప్రజాపతి సోదరుల

Published: Monday March 13, 2023

నేడు తొలితెలుగు కవయిత్రి మొల్లామాంబ  583 వ జయంతి వేడుకలను సోమవారం నాడు  నియోజకవర్గంలోని  అన్ని మండలాలలో ఘనంగా జరిపించాలని నియోజవర్గ కుమ్మర సంఘం అధ్యక్షుడు బస్వాపురం కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్వర్మాయణంను రచించిన తొలి కవియిత్రిగా పేరుపొందిన ఆతుకూరి మొల్ల 1440-1530 కాలానికి చెందినది. ఈమె జీవిత కాలం గురించి భిన్నాభిప్రాయాలున్ననూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయాని చెందిన కవయిత్రిగా భావిస్తున్నారని తెలిపారు.మొల్ల అంటే మల్లెపూవు. కవయిత్రి మొల్లనూ, ఆమె రామాయణాన్నీ తలచుకోగానే మనసుకు ఒక కమ్మని పూతావి సోకినట్లుంటుంది. ఆమె తన భక్తినీ, కవితాశక్తినీ కలబోసి క్లుప్తంగా ఓ మనోహరమైన రాయాయణాన్ని తెలుగు భాషకు దయచేసింది. 15వ శతాబ్ది ప్రారంభంలో జీవించిన మొల్ల పెద్దనాది రాయల కాలపు ప్రబంధ కవులకన్నా కొంచెం పూర్వపు కవయిత్రి అని చెపుతారు. కుమ్మర కులంలో పుట్టిన మల్లా జాతికే ఆదర్శమని ఆయన ఆమె సేవలను కొనియాడారు.