ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని : కాంగ్రెస్ నాయకులు

Published: Thursday April 29, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగందర్ రెడ్డి అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులు గడుస్తున్నా కొనుగోళ్లు నామమాత్రంగా చేపట్టారు. మండల వ్యాప్తంగా ఐకెపి ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాలు, అరూర్ పిఏసీఎస్ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలు, వలిగొండ పిఏసీఎస్ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు మొత్తం 31 కొనుగోలు కేంద్రాలలో సుమారుగా 35 వేల బస్తాల ధాన్యం తుకాలు వేసి నిల్వ చేశారు. 3 రోజులుగా లారీలు అందక ధాన్యం రవాణా కావడంతో ధాన్యం ఎండకు ఎండి తుకాలు తగ్గిపోతాయని, దానితో మిల్లర్లు తుకాలు తగ్గాయని కొర్రెలు పెడతారని, రవాణా అయిన ధాన్యం మిల్లుల వద్దలారీలను 3 రోజులుగా ఆపి తాలు సాకుతో దిగుమతులు చేసుకోవడం లేదు. గాన్నీ బ్యాగులు, లారీల కొరత, హమాలీలు లేక దిగుమతుల కొరతతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి లారీలను అందుబాటులోకి తెచ్చి ధాన్యం రవాణా చేసే విదంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.