మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్ పార్టీ

Published: Thursday November 25, 2021
మధిర నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధిరోజు మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆదేశం తో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ మధిర కాంగ్రేస్ పార్టి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా అధ్యక్షతన మధిర తాసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరాష్ట్రంలో వరి ధాన్యం పంటను మద్దతు ధరలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి ఆత్యంత దయనీయంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతలు మాది కాదు అంటే మాది కాదు అంటూ పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లక్షల క్వింటాళ్ల ధాన్యం నేడు కల్లాలల్లో, రోడ్లపైనే ఉండి పోయి వర్షానికి తడిసి పాడైపోయింది. అలాగే ధాన్యం వరదలకు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోల్లలో జాప్యం, వరదల నష్టాల తదితర సమస్యలతో అన్నదాతలు గుండెపోట్ల తో కొందరు, ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖిరితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాష్ర్రంలో వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులను అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయగానే వీరికి సకాలంలో డబ్బులు చెల్లించాలి. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. రాబోయే రోజుల్లో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసి ధాన్యం రైతులకు భరోసా కల్పించాలని, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో. మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మండల అధ్యక్షుడు కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వరరెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ గ్రామ సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మధిర మున్సిపల్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు మధిర మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి గాంధీ పదం అధ్యక్షుడు బోడేపూడి గోపి మండల సేవదల్ అధ్యక్షుడు అదురీ శ్రీను, మండల కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ అల్లాడి గోపాల్ రావు మండల ST సెల్ అధ్యక్షుడు బాలు నాయక్ మధిర పట్టణ అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ sc సెల్ అధ్యక్షుడు గద్దల లాలయ్యా మాజీ సర్పంచ్ బొమ్మకంటి హారిబాబు కాంగ్రెస్ నాయకులు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, ముస్లిం వెల్ఫేయిర్ కమిటి అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అలీ సంపాసల రామకృష్ణ, కోటడేవిడ్, బండారునర్సింహారావు, కరివేద రాంబాబు, గద్దల విజయ్, వనమా పిచ్చియ్య, నిడ మనూరి వంశీ, చెరకు నాగ మురళి కృష్ణ, దొమందుల సురేష్, మైలవరపు చక్రి మొదలగువారు పాల్గొన్నారు