స్వామీ వివేకానంద ఆశయాలు ఆదర్శనీయం..... --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

Published: Friday January 13, 2023

జగిత్యాల, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి): భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన  స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని 45వ వార్డ్ లో ఆయన విగ్రహానికి జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ వివేకానందుని 150 వ జయంతి ఉత్సవాలను జగిత్యాల లో చాలా గొప్పగా జరుపుకున్నము అన్నారు. జగిత్యాల మినీ స్టేడియానికి స్వామీ వివేకానంద స్టేడియం అని పెట్టడం జరిగిందని అన్నారు. స్వామీ వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ప్రతి ఒక్కరూ ఆచరణ లో పెట్టాలి అన్నారు. ప్రతి యువత వారి నైపుణ్యాలను తెలుసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. స్వామీ వివేకానంద వారికి పూల మాల సమర్పణ కు ఇబ్బంది అవుతుందని మెట్ల ను ఎమ్మేల్యే నిధుల నుండి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డా. నరేష్, కౌన్సిలర్ బోడ్ల జగదీష్, యూత్ అధ్యక్షుడు గిరి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, రాజ గోపాల చారి, కౌన్సిలర్ లు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.