ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి *పట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చ

Published: Friday January 20, 2023
*ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ లో గురువారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా   విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, భారత రాష్ట్ర సమితి పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు  క్యామ మల్లేష్, యువ నేత  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా వ్యవసాయశాఖ  అధికారుల సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన  పాలకవర్గ సభ్యులతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.  అనంతరం విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని
మార్కెట్ కమిటీ సభ్యులకు మంత్రి సబితారెడ్డి సూచన చేశారు.రైతులకు మెరుగైన సేవలు అందించడానికి మార్కెట్ కమిటి పాలకవర్గం శక్తివంచనలేకుండా కృషిచేయాలని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రా రెడ్డి సూచించారు. మార్కెట్ కమిటీకి ఎంపికవడం పదవిమాత్రమే కాదని రైతుల  కు సేవచేసే మాహద్భాగ్యాన్ని కలిగించే సదవకాశమన్నారు. రైతులు పండించిన పంటలకు తగు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విదంగా  ఆలోచనలు చేసి చర్యలు చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషితో మార్కెట్ కమిటీలది కీలకమైన పాత్ర అని అన్నారు. మార్కెట్ యార్డులను రైతులకు అనువైన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, ప్రతి మండలంలో గిడ్డంగులు నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దృష్టికి రైతుల సాదకబాధకాలను చేరవేసి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని చైర్మెన్  సభ్యులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మెన్ కల్వకోల్ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు నారి యాదయ్య, మొగిలి పావని వెంకటేష్, మిర్యాణం కిరణ్ కుమార్, మంగ వెంకటేష్, ఆడాల గణేష్, మహ్మద్ జానిపాష, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, రాజస్వ మండల అధికారి వెంకటాచారి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బిట్ల వెంకట్ రెడ్డి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వ్యవసాయమార్కెట్  శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు . వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లు టేకుల సుదర్శన్ రెడ్డి, బస్సు పుల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి తదితర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.