కురుమ విద్యార్థుల ఉన్న‌త చ‌దువుకు స‌హ‌క‌రిస్తా

Published: Monday November 08, 2021
సంఘం ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవర రాజేశ్వర్ కురుమ
మేడిపల్లి, నవంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) : కురుమ విద్యార్థులు ఐఎఎస్, ఐపీఎస్ చ‌దువుకు కావాల్సిన స‌హ‌యంతోపాటు హ‌స్ట‌ల్ వ‌సతి, ఖ‌ర్చుల‌ను తానే భ‌రిస్తాన‌ని కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు వైస్ చైర్మన్ దేవర రాజేశ్వర్ కురుమ హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 74 ఏండ్లు అవుతున్న కురుమ సామాజిక వర్గం నుంచి ఒక్క ఐఎఎస్, ఐపీఎస్ స్థాయి అధికారి లేకపోవడం విచారకరం అని అన్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం గ్రామానికి చెందిన దయ్యాల సత్యనారాయణ కురుమ కుమారుడు, కురుమ ప్రముఖ సంఘసేవకులు దయ్యాల కొమురయ్య మనవడు అనిరుధ్ కురుమ నీట్‌లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఉప్పల్ బీరప్పస్వామి దేవాలయంలో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షుడు రేవు కృష్టయ్య కురుమ, ప్రధాన కార్యదర్శి చౌదరపల్లి పర్వతాలు కురుమ అధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగే మల్లేశ్‌, గోరిగే రమేష్, పాశం యాదగిరి లు అనిరుధ్ కురుమ, ఇంటర్నెషనల్ కిక్ బాక్సింగ్ గోల్డ్ మెడల్ సాధించిన మదారంచిరు చరణ్ కురుమను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నీట్‌లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించిన అనిరుధ్ కురుమ, ఇంటర్నెషనల్ కిక్ బాక్సింగ్ గోల్డ్ మెడల్ సాధించిన మదారంచిరు చరణ్ కురుమ త‌ల్లిదండ్రులు, గురువుల‌ను కూడా పూలమాలలు, శాలువాల‌తో ఘ‌నంగా సత్కరించారు. అనంతరం  కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు వైస్ చైర్మన్ దేవర రాజేశ్వర్ కురుమ మాట్లాడుతూ ఐఎఎస్, ఐపీఎస్ ల‌క్ష్యంగా కురుమ విద్యార్థులు ముందుకు సాగాల‌ని సూచించారు. అందుకు అవ‌స‌ర‌మైన హాస్ట‌ల్ వ‌స‌తి, ఖ‌ర్చులు తానే భరిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ప్రభుత్వ విధానాలు రూపొందించే స్థాయికి కురమలు ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించేలా చదువుకోవాలని అన్నారు. నీట్‌లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించిన అనిరుధ్‌ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానానికి చేరుస్తుందని అన్నారు. రాజ్యాధికారం కోసం కురుమలు సంఘటితం అయి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. రాజకీయ, రాజ్యాధికారంలో భాగంగా కావాలని అన్నారు. కురుమ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో హాస్టల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కురుమల అభివృద్ధి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కురుమలు ఉన్నతస్థానానికి ఎదగాలి అంటే ఖచ్చితంగా చదువు అవసరమని, అందుకు అనుగుణంగా బాగా చదువుకోవాలని కోరారు. కురుమ యువత చదువుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి కురుమ అన్నారు. కురుమ యువత ఐఎఎస్, ఐపీఎస్ సాధించాలని, అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పారు. ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడే తోటి కురుమలను చైతన్యవంతులను చేయగలమని ఆయన వివరించారు. కురుమ అణిముత్యాల అభివృద్ధికీ కురుమ సంఘం పాటుప‌డాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించాల‌ని సూచించారు. రాజకీయ, సామాజికంగా బలపడాలంటే కురుమలు, కురుమ యువత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగే మల్లేశ్ అన్నారు. విద్యార్థులకు అన్ని రకాలు అండగా నిలబడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కురుమ, రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు గొరిగే రమేశ్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి గొరిగే మల్లేష్ కురుమ, కురుమ సంఘం నాయకులు గొరిగే కృష్ణ కురుమ, గొరిగే ఐలయ్య కురుమ, చిందం వెంకటేష్ కురుమ, శగా పెంటయ్య కురుమ, కర్రే శ్రీనివాస్ కురుమ, జూకంటి రవీందర్ కురుమ, ఒగ్గు చంద్రశేఖర్ కురుమ, నారి వెంకటేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు.