మండలంలో 132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరసన తెలుగుదేశం అదిలాబాద్ పార్లమెంటరీ

Published: Friday October 28, 2022

జన్నారం, అక్టోబర్ 27, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో సర్వసభ్య సమావేశం సందర్బంగా మండల కేంద్రంలో 132 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం అదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అనంతరం ఎంపిడివో అరుణ రాణికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ సరపర నిర్వహిస్తున్నారు, 29 గ్రామ పంచాయతీలకు 11 కెవి విద్యుత్ సరఫరా చేయడంవల్ల, లో వోల్టేజ్ విద్యుత్ సమస్య మండల వాసులకు ఏర్పడుతుందని అయన పేర్కొన్నారు. మండలంలోని విద్యుత్ వినియోగదారులు వ్యాపారస్తులు రైతులు విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లో వోల్టేజ్ సమస్య పూర్తిగా తీరాలంటే 132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారులకు రైతులకు తీవ్రంగా విద్యుత్ సమస్య తరితుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుల విజయ్ పార్లమెంట్ నాయకులు పులిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.